Director's Day event : 19న డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌

ABN , Publish Date - May 05 , 2024 | 06:36 AM

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని ప్రతి ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలను తెలుగు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఘనంగా నిర్వహించింది...

Director's Day event : 19న డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని ప్రతి ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలను తెలుగు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ మాట్లాడుతూ ‘‘దాసరి నారాయణరావు సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఈ ఏడాది డైరెక్టర్స్‌ డే ఈవెంట్‌ను 19న సాయంత్రం ఆరు గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ నిర్మాత దామోదర ప్రసాద్‌, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ సెక్రటరీ అనుపమ రెడ్డి, ఫిల్మ్‌ నగర్‌ కార్పోరేటర్‌ కాజా సూర్యనారాయణ, నిర్మాతలు ప్రసన్న కుమార్‌, సి కల్యాణ్‌, దర్శకులు అనిల్‌ రావిపూడి, వశిష్ఠ, గోపీచంద్‌ మలినేని, విజయ్‌ కనకమేడల, శంకర్‌, రేలంగి నరహింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 06:37 AM