మే 4న ఘనంగా డైరెక్టర్‌ డే వేడుకలు

ABN , Publish Date - Apr 11 , 2024 | 04:45 AM

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని తెలుగు దర్శకుల సంఘం డైరెక్టర్స్‌ డే గా సెలబ్రేట్‌ చేస్తోంది. ఈ ఏడాది మరింత భారీగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ వివరాలను అసోసియేషన్‌...

మే 4న ఘనంగా డైరెక్టర్‌ డే వేడుకలు

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి (మే 4)ని తెలుగు దర్శకుల సంఘం డైరెక్టర్స్‌ డే గా సెలబ్రేట్‌ చేస్తోంది. ఈ ఏడాది మరింత భారీగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ వివరాలను అసోసియేషన్‌ అధ్యక్షుడు వీరశంకర్‌ వెల్లడిస్తూ ‘ డైరెక్టర్స్‌ డే ను ఎల్బీ స్టేడియంలో భారీగా నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈ ఈవెంట్‌ ద్వారా వసూలయ్యే మొత్తాన్ని అసోసియేషన్‌ సంక్షేమం కోసం వినియోగిస్తాం. ఈ ఈవెంట్‌ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో అనిల్‌ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి తదితరులు ఉంటారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం’ అన్నారు. దర్శకుల సంఘానికి ఇదొక బెంచ్‌ మార్క్‌ ఈవెంట్‌ అవుతుందని నందినీ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే త్రివిక్రమ్‌, సుకుమార్‌ వంటి పెద్ద దర్శకులందరూ సపోర్ట్‌ చేయడానికి ముందుకు వచ్చారని సాయి రాజేశ్‌ చెప్పారు. గతంలో వజ్రోత్సవాలు ఏ స్థాయిలో జరిగాయో అంత ఘనంగా డైరెక్టర్స్‌ డే ను సెలబ్రేట్‌ చేస్తామని వశిష్ట చెప్పారు.

Updated Date - Apr 11 , 2024 | 04:45 AM