దర్శకుడు సంగీత్‌ శివన్‌ ఇక లేరు

ABN , Publish Date - May 09 , 2024 | 06:30 AM

మలయాళంలో, హిందీలో పలు హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన సంగీత్‌ శివన్‌. (65) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ ఆస్పత్రిలో చేర్చగా...

దర్శకుడు సంగీత్‌ శివన్‌ ఇక లేరు

మలయాళంలో, హిందీలో పలు హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన సంగీత్‌ శివన్‌. (65) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూభాయ్‌ ఆస్పత్రిలో చేర్చగా.. బుధవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ఆయన సోదరుడు, సినిమాటోగ్రాఫర్‌ సంతోశ్‌ శివన్‌ తెలిపారు. సంగీత్‌ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, దర్శకుడు శివన్‌(శివశంకరన్‌ నాయర్‌) సంతానంలో పెద్ద కుమారుడు సంగీత్‌ శివన్‌. 1990లో దర్శకుడిగా మలయాళంలో ‘వ్యూహం’ చిత్రంతో అరంగేట్రం చేశారు సంగీత్‌ శివన్‌. ఆ తర్వాత 1998లో సన్నీ డియోల్‌, సుస్మితా సేన్‌ నటించిన ‘జోర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మలయాళ చిత్రం ‘యోధా’, బాలీవుడ్‌ చిత్రం ‘అప్నా సప్నా మనీ మనీ’ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Updated Date - May 09 , 2024 | 06:30 AM