Lambasingi: ఆ వేదన నాకు తెలుసు.. అందుకే లంబసింగి నిర్మించా: ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ

ABN , Publish Date - Mar 17 , 2024 | 02:26 PM

కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, దివి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

Lambasingi: ఆ వేదన నాకు తెలుసు.. అందుకే లంబసింగి నిర్మించా: ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ
Lambasingi

కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి (Lambasingi). భారత్ రాజ్ (Bharat Raj), దివి (Divi) హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు ధన్యవాదాలు, మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయన్నారు. టాలెంట్ ఉండి అవకాశాలు రాక చాలా మంది ఉంటారని..నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని అందుచేత కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టానన్నారు.

lamba-singi.jpg

నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు వెయిట్ చేశాన‌ని,, ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ అవకాశం ఇచ్చారని ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానన్నారు. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిల‌కు అవకాశాలు రావాలన్నారు. భారత్ రాజ్, దివి ఈ సినిమాలో బాగా నటించార‌న్నారు. నవీన్ గాంధీ తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారని, ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడ‌న్నారు. సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్.ధ్రువన్ మాట్లాడుతూ.. లంబసింగి (Lambasingi) సినిమా నాకు చాలా స్పెషల్, సాంగ్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. సినిమా చూసి వచ్చిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను అన్నారు. దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ.. ఈ కథ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు అదే బరువైన హృదయంతో బయటికి వస్తున్నారన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలని, ఈ సినిమాకు సపోర్ట్ చేసిన జీ.కె.మోహన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అంతా వారి బెస్ట్ ఇచ్చారన్నారు. దివి, భారత్ చాలా ఇంటెన్స్ తో నటించాని, మా లంబసింగి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

WhatsApp Image 2024-03-17 at 12.48.07 PM.jpeg

హీరోయిన్ దివి మాట్లాడుతూ.. కళ్యాణ్ కృష్ణ గారు ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి స్పెషల్ థాంక్స్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము, నవీన్ గాంధీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. రెస్పాన్స్ బాగుందని అన్నారు. హీరో భారత్ రాజ్ మాట్లాడుతూ.. కళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వంలో ఒక చిన్న రోల్ చెయ్యాలని అనుకున్నాను. అలాంటిది ఆయన నిర్మాతగా చేసే సినిమాలో లీడ్ రోల్ చెయ్యడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినిమాలో మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారని క్రెడిట్ మొత్తం ధ్రువన్ గారికి చెందుతుంది అన్నారు. నవీన్ గాంధీ గారు సినిమాను తీసిన విధానం చాలా బాగుంద‌ని, వీరబాబు పాత్రను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Mar 17 , 2024 | 02:26 PM