మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lambasingi: లంబసింగి ట్రైలర్.. ఫ్రెష్ ఫీల్ ఇస్తోంది: హరీష్ శంకర్

ABN, Publish Date - Mar 11 , 2024 | 04:07 PM

‘లంబసింగి’ అనే చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.

lambasingi

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే.. అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’(Lambasingi). ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ఈ ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ (Kalyankrishna Kurasala) కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. నవీన్ గాంధీ (naveen gandhi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు.

భరత్‌ రాజ్(Bharat Raj)ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి (Divi) కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ (Concept Films ) పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు "నచ్చేసిందే.. డోలారే.. వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. లేటెస్ట్ గా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకులు హరీష్ శంకర్ (Harish Shankar) విడుదల చేశారు.


ఈ సందర్భంగా హరీష్ శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ... కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాల అనిపించిందని, ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుందన్నారు. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. క‌థానాయిక‌ దివికి, భరత్ రాజ్‌కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని, ‘లంబసింగి’(Lambasingi) సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 04:55 PM