సెట్‌లో దర్శకుడి బర్త్‌ డే

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:46 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‌’. ‘కొంచెం క్రాక్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం...

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‌’. ‘కొంచెం క్రాక్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. సీనియర్‌ ప్రొడ్యూసర్‌ బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం నేపాల్‌లో జరుగుతోంది. ఇప్పటికి ఎనభై శాతం చిత్రం పూర్తయిందనీ, ఫ్రెష్‌ కామెడీతో లాఫింగ్‌ రైడ్‌లా సినిమా ఉంటుందని నిర్మాత చెప్పారు. సోమవారం దర్శకుడు భాస్కర్‌ పుట్టినరోజు కావడంతో సెట్‌లో సెలబ్రేట్‌ చేశారు. ప్రకాశ్‌రాజ్‌, హీరోయిన్‌ వైష్ణవి తదితరులు కూడా పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 02:46 AM