దర్శకుడు ఎన్‌.శంకర్‌ మూడు హిస్టారికల్‌ వెబ్‌ సిరీస్‌లు

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:09 AM

సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ఉండాలని నమ్మే దర్శకుల్లో ఎన్‌.శంకర్‌ ఒకరు. పలు విభిన్న చిత్రాలు రూపొందించిన ఆయన తాజాగా చారిత్రక నేపథ్యంలో మూడు...

దర్శకుడు ఎన్‌.శంకర్‌ మూడు హిస్టారికల్‌ వెబ్‌ సిరీస్‌లు

సినిమాల్లో వాణిజ్య అంశాలతో పాటు సామాజిక ప్రయోజనం కూడా ఉండాలని నమ్మే దర్శకుల్లో ఎన్‌.శంకర్‌ ఒకరు. పలు విభిన్న చిత్రాలు రూపొందించిన ఆయన తాజాగా చారిత్రక నేపథ్యంలో మూడు వెబ్‌ సిరీస్‌లు తీయడానికి సంకల్పించారు. బుధవారం వాటి విశేషాలు వెల్లడిస్తూ ‘ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ప్రాంతం ఇండియన్‌ యూనియన్‌లో కలవడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడడం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాట నేపథ్యం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకూ ఉద్యమాల్లో జరిగిన ఆటుపోట్లు, కవులు, కళాకారులు, మేధావులు పంచిన చైతన్యం, విద్యార్థులు, యువకుల త్యాగాలు.. తదితర అంశాలను ప్రజల కోణంలో చూపించాలని మా ప్రయత్నం. అక్టోబర్‌ నుంచి షూటింగ్‌కు శ్రీకారం చుడతాం’ అని చెప్పారు. అలాగే జ్యోతీరావు పూలే అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు, ఆయన ఎదుర్కొన సమస్యలు, అవమానాలు కథాంశంగా మరో వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నట్లు శంకర్‌ వెల్లడించారు. అదే విదంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వ్యక్తి నుంచి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణలు, అణగారిన వర్గాలకు ఆయన ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి ఇతివృతంగా ఇంకో వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తామని ఆయన చెప్పారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ వెబ్‌ సిరీస్‌లు వారి బయోగ్రఫీలు కాదని శంకర్‌ స్పష్టం చేశారు. తెలుగు, మిందీ భాషల్లో ఈ మూడు వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తామనీ, మూడేళ్ల నుంచి తన టీమ్‌తో కలసి కథలపై వర్క్‌ చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 05:09 AM