విభిన్నంగా ‘క’

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:09 AM

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘కె’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌తో సుజిత్‌, సందీప్‌ దర్శకులుగా..

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘కె’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌తో సుజిత్‌, సందీప్‌ దర్శకులుగా పరిచయమవుతున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తయిందనీ, ఈ చిత్ర నిర్మాణం తమకు మధురమైన అనుభూతులు మిగిల్చిందనీ, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను ఇచ్చిందనీ వారు పేర్కొన్నారు. సినిమా సాధించే హిట్‌ కోసం ఎదురుచూస్తున్నామని సుజిత్‌, సందీప్‌ చెప్పారు. టైటిల్‌కు తగ్గట్లుగానే సినిమా కూడా విభిన్నంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేస్తున్నారు..

Updated Date - Sep 26 , 2024 | 01:09 AM