మూడు రోజులు నిద్రపోలేదు

ABN , Publish Date - Nov 20 , 2024 | 03:47 AM

‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఉడుగుల. ఆయన నిర్మాతగా మారి రాహుల్‌ మోపిదేవితో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్‌ రామ్‌బాయి’....

‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఉడుగుల. ఆయన నిర్మాతగా మారి రాహుల్‌ మోపిదేవితో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్‌ రామ్‌బాయి’. సాయిలు కంపాటి దర్శకుడు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ ‘‘దర్శకుడు సాయిలు తన ఊరిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నారు. ఈ కథ విన్నాక అద్భుతమైన ఫీల్‌ కలిగింది. ఎంతో వైవిధ్యమైన ప్రేమకథ ఇది. ఈ సినిమా క్లైమాక్స్‌ విని నాకు మూడు రోజులు నిద్రపట్టలేదు. అంతగా నన్ను వెంటాడిందా క్టైమాక్స్‌’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: నరేశ్‌ అడుప, సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌, సంగీతం: సురేశ్‌ బొబ్బిలి.

Updated Date - Nov 20 , 2024 | 03:47 AM