ఖరీదైన కానుకలు ఇచ్చా
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:12 AM
ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ‘హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించారు సమంత. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె హీరో వరుణ్ ధావన్‌తో ‘స్పైసీ ర్యాపిడ్ ఫైర్’ అనే సరదా సంభాషణలో....
ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన వెబ్ సిరీస్ ‘హనీ బన్నీ’తో ప్రేక్షకులను పలకరించారు సమంత. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె హీరో వరుణ్ ధావన్‌తో ‘స్పైసీ ర్యాపిడ్ ఫైర్’ అనే సరదా సంభాషణలో పాల్గొన్నారు. ‘ట్రూత్ అండ్ డేర్’ గేమ్‌లా ఉండే ఇందులో.. వరుణ్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి.. చెప్పలేకపోతే పచ్చిమిర్చి తినాలి. ‘మీరు ఏ వస్తువుల కోసం డబ్బులు అనవసరంగా ఖర్చు చేశారు’ అని వరుణ్ అడిగారు. ‘‘నా ఎక్స్‌కు ఇచ్చిన కానుకల కోసం’ అని సమంత సమాధానమిచ్చారు. ‘అవునా.. ఎంత ఖర్చైంది’ అని వరుణ్ అడగ్గా.. ‘కొంచెం ఎక్కువే.. ఇక, తరువాతి ప్రశ్నకు పోదామా’ అని సమంత బదులిచ్చారు. ‘మీరు ఈ కార్యక్రమానికి వచ్చే ముందు ఎవరికి చివరగా మెసేజ్ చేశారు. దాన్ని పైకి చదివి వినిపిస్తారా’ అని వరుణ్ అడగ్గా.. ఆ ప్రశ్నకు సమాధానమివ్వని సామ్ పచ్చిమిర్చి తిన్నారు.