‘ధీర’ విజయవంతం కావాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:52 AM

‘చదలవాడ బ్రదర్స్‌ను పాతికేళ్ల నుంచి చూస్తూనే ఉన్నా. అనూరాధ ఫ్రొడక్షన్స్‌ బేనరుపై ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారు. ప్రారంభంలో నాకు వారితో పెద్దగా పరిచయం లేదు. ‘దసరా’ చిత్రాన్ని శ్రీనివాసరావుగారు కొన్నారని తెలిసిన తర్వాత...

‘ధీర’ విజయవంతం కావాలి

‘చదలవాడ బ్రదర్స్‌ను పాతికేళ్ల నుంచి చూస్తూనే ఉన్నా. అనూరాధ ఫ్రొడక్షన్స్‌ బేనరుపై ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారు. ప్రారంభంలో నాకు వారితో పెద్దగా పరిచయం లేదు. ‘దసరా’ చిత్రాన్ని శ్రీనివాసరావుగారు కొన్నారని తెలిసిన తర్వాత ఆయన్ని కలిశాను. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఎంతో దగ్గరయ్యాం. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నేను గెలవడం కోసం ఆయన చాలా సాయం చేశారు. శ్రీనివాసరావుగారి అబ్బాయి లక్ష్‌ నటించిన ‘ధీర’ ట్రైలర్‌ బాగుంది. అతని కష్టానికి, యూనిట్‌ శ్రమకు తగిన ప్రతిపలం రావాలి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలి’ అని కోరారు దిల్‌ రాజు. మంగళవారం జరిగిన ‘ధీర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. చిత్రం బిగ్‌ టికెట్‌ను దిల్‌ రాజు, గోపీచంద్‌ మలినేని, త్రినాథరావు నక్కిన లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఇన్నేళ్లలో ఏ హీరోని నేను డేట్స్‌ అడగలేదు. ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశాను. ‘ధీర’ చిత్రంతో విక్రాంత్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మా అబ్బాయి లక్ష్‌ ను చూసి గర్విస్తుంటాను. ‘ధీర’ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఐదేళ్ల నుంచి నేను ఓ సినిమా తీస్తున్నా. అది పాన్‌ వరల్డ్‌ చిత్రం. మా బేనర్‌లో ఇప్పుడు పదహారు చిత్రాలు తయారవుతున్నాయి. ప్రతి నెలా ఒకటి చొప్పున విడుదల చేస్తాం.’ అని చెప్పారు. ‘ఈ సినిమాలో పాత్రకూ, రియల్‌ లైఫ్‌లోని నా క్యారెక్టర్‌కూ ఏ మాత్రం సంబంధం లేదు. పక్కనోడి గురించి పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తుంటాడు. అలాంటి వాడికి ఓ మిషన్‌ అప్పగిస్తే, ఆ ప్రయాణంలో వచ్చే సమస్యల్ని ‘ధీర’లో చూపిస్తున్నాం. మా నాన్నగారు లేకపోతే నేను లేను. ఆయన వన్‌ మ్యాన్‌ ఆర్మీ. విజయాలు వచ్చినా, అపజయాలు ఎదురైనా ఆయన బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. మా సినిమాతో పాటు విడుదలవుతున్న చిత్రాలన్నీ ఆడాలి’ అన్నారు లక్ష్‌. ఎన్టీఆర్‌ నటించిన ‘డ్రైవర్‌ రాముడు’ రిలీజ్‌ అయిన ఫిబ్రవరి రెండున వస్తున్న ‘దీర’ సక్సెస్‌ కావాలని నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ కోరారు. ‘ధీర’ చాలా యూనిక్‌ పాయింట్‌ అని దర్శకుడు విక్రాంత్‌ చెప్పారు. హీరో పాత్రకు కూడా గ్రే షేడ్స్‌ ఉంటాయనీ, ఎనభై శాతం చిత్రం నైట్‌ ఎఫెక్ట్‌లోనే ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వై.వి.ఎ్‌స.చౌదరి తదితరులు మాట్లాడారు.

Updated Date - Feb 01 , 2024 | 02:52 AM