Aishwarya Sharma : నా పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుంది
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:49 AM
ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు.
- ఐశ్వర్య శర్మ
ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఐశ్వర్యశర్మ మీడియాతో పంచుకున్నారు. ‘నటనలో శిక్షణ తీసుకున్నాక కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించాను. నటిగా ‘డ్రింకర్ సాయి’ నాకు తొలి చిత్రం. నేను చేసిన బాగీ పాత్రకు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు. ఇందులో వైద్య విద్యార్థినిగా కనిపిస్తాను. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కు భిన్నంగా నా పాత్ర ఉంటుంది. ట్రైలర్ చూసి కొంతమంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పోలిక తెచ్చారు కానీ మా ‘డ్రింకర్ సాయి’ కథ పూర్తి భిన్నంగా ఉంటుంది. కథా బలమున్న చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. తెలుగు అమ్మాయిని కాకపోవడంతో సెట్‌లో సంభాషణలు పలికేందుకు కొంత ఇబ్బందిపడ్డాను. హీరో ధర ్మ, దర్శకుడు కిరణ్ నాకు సాయం చేశారు. నా నటన సహజంగా ఉండేలా చూసుకునేందుకు చాలా శ్రమించాను. ‘డ్రింకర్ సాయి’ చిత్రంతో ఒక మంచి ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మంచి సందేశం కూడా ఈ సినిమాలో ఉంది’ అని అన్నారు.