కోటి రూపాయల విరాళం అందించిన ధనుశ్‌

ABN , Publish Date - May 15 , 2024 | 12:26 AM

తమిళ నటుడు ధనుశ్‌ తన సహృదయాన్ని చాటుకున్నారు. ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నూతన భవన నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం అందించారు. నడిగర్‌ సంఘానికి అధ్యక్షుడైన నాజర్‌...

కోటి రూపాయల విరాళం అందించిన ధనుశ్‌

తమిళ నటుడు ధనుశ్‌ తన సహృదయాన్ని చాటుకున్నారు. ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నూతన భవన నిర్మాణం కోసం కోటి రూపాయల విరాళం అందించారు. నడిగర్‌ సంఘానికి అధ్యక్షుడైన నాజర్‌ ఈ కోటి రూపాయల చెక్‌ను అందుకున్నారు. ధనుశ్‌కు కృతజ్ఞతతో అసోసియేషన్‌ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ అసోసియేషన్‌లో నటుడు విశాల్‌ ప్రధాన కార్యదర్శి కాగా, నటుడు కార్తి కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఈ అసోసియేషన్‌కు ఇప్పటికే పలువురు కోలీవుడ్‌ స్టార్స్‌ భారీ విరాళాలు ఇచ్చారు. కమల్‌ హాసన్‌, విజయ్‌ కోటి రూపాయల విరాళం అందివ్వగా, శివ కార్తికేయన్‌ 50 లక్షలు ఇచ్చారు.

Updated Date - May 15 , 2024 | 12:26 AM