ధనుష్‌ @ 50 రాయన్‌

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:30 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ ధనుష్‌ నటిస్తున్న 50వ చిత్రానికి ‘రాయన్‌’ అనే పేరు నిర్ణయించారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రంలో ధనుష్‌ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా...

ధనుష్‌ @ 50 రాయన్‌

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ ధనుష్‌ నటిస్తున్న 50వ చిత్రానికి ‘రాయన్‌’ అనే పేరు నిర్ణయించారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రంలో ధనుష్‌ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ ముగురూ ఉన్న ‘రాయన్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ధనుష్‌ ఫుడ్‌ ట్రక్‌ ముందు నిలబడి ఉంటే, సందీప్‌ కిషన్‌ వాహనం లోపల, కాళిదాస్‌ దానిపైన కనిపించారు. ధనుష్‌ ఆప్రాన్‌ మీద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎస్‌ జె సూర్య, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ డీవోపీ. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్‌ వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించింది.

Updated Date - Feb 20 , 2024 | 05:30 AM