Indravathi Chauhan : వస్తుండాయి పీలింగ్స్‌

ABN, Publish Date - Dec 21 , 2024 | 03:48 AM

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఉహూ అంటావా’ పాటతో నూతన గాయని ఇంద్రావతి చౌహాన్‌ని పరిచయం చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ‘పుష్ఫ 2’ సినిమాతో మరో కొత్త గాయనికి

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఉహూ అంటావా’ పాటతో నూతన గాయని ఇంద్రావతి చౌహాన్‌ని పరిచయం చేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ‘పుష్ఫ 2’ సినిమాతో మరో కొత్త గాయనికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలోని ‘వస్తుండాయి పీలింగ్స్‌’ అనే పాట పాడిన గాయని పేరు దాస లక్ష్మి. నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం గన్నోర గ్రామానికి చెందిన ఈ జానపద గాయని చిన్నప్పటి నుంచి తల్లి జయశీల పాడే మరాఠీ కీర్తనలు, మరాఠీ పాటలు అనుకరిస్తూ తెలుగులో ఫోక్‌ సాంగ్స్‌ పాడుతుండేది. ఆమె ప్రతిభను గమనించిన ఆ గ్రామానికి చెందిన కళాకారుడు దిగంబర్‌ పాటలలో మెళకువలను నేర్పించారు. అవకాశం దొరినప్పుడల్లా రకరకాల ప్రోగ్రామ్స్‌లో పాటలు పాడిన దాస లక్ష్మి యూట్యూబ్‌ వల్ల ఎంతో పాపులర్‌ అయింది. ఆమె పాడిన దాదాపు 700కి పైగా జానపద గీతాలు యూ ట్యూబ్‌ ద్వారా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. టాలెంట్‌ ఉన్న కొత్తవారికి అవకాశాలు ఇచ్చే దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ‘పుష్ప 2’ లో దాస లక్ష్మికి అవకాశం ఇచ్చారు. ఆమె పాడిన ‘వస్తుండాయి పీలింగ్స్‌’ పాట వైరల్‌ కావడంతో దాస లక్ష్మి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతోంది. నిర్మల్‌ జిల్లా జానపద గాయకురాలికి ఇలా సినిమాలో పాట పాడే అవకాశం రావడం.. అది హిట్‌ కావడంతో లక్ష్మీని జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ముథోల్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 21 , 2024 | 03:48 AM