దేవర... ఎన్టీఆర్‌కు స్పెషల్‌

ABN , Publish Date - May 07 , 2024 | 05:55 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం కావడంపై ‘దేవర పార్ట్‌ వన్‌’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం...

దేవర... ఎన్టీఆర్‌కు స్పెషల్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం కావడంపై ‘దేవర పార్ట్‌ వన్‌’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఇటీవల ఎన్టీఆర్‌ ‘అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా చిత్రం ఉంటుంది’ అని కామెంట్‌ చేసి అభిమానుల్లో జోష్‌ పెంచారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌కు, ఆయన అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలో అప్‌డేట్స్‌ వస్తాయి’ అన్నారు. ఈ నెల 20 ఎన్టీఆర్‌ బర్త్‌డే కావడంతో ఆ రోజు ‘దేవర చిత్రం నుంచి సర్‌ప్రెజ్‌ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘దేవర’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతోంది. ఎన్టీఆర్‌ మాత్రం ముంబైలో ‘వార్‌ 2’ షూటింగ్‌లో ఉన్నారు.

Updated Date - May 07 , 2024 | 05:55 AM