థాయ్‌లాండ్‌ వెళుతున్న దేవర

ABN , Publish Date - Jun 19 , 2024 | 04:21 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవర’ మీదే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం...

థాయ్‌లాండ్‌ వెళుతున్న  దేవర

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దేవర’ మీదే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తున్న తారక్‌ సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య కారణం. దర్శకుడు కొరటాల శివ ఓ అద్భుత చిత్రంగా ‘దేవర’ను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే గోవాలో ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ మీద ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. గోవాలో భారీ వర్షం కురుస్తున్నా వెనుకడుగు వేయకుండా, రాజీ పడకుండా ఈ ఫైట్‌ చిత్రీకరించడం గమనార్హం. త్వరలో థాయ్‌లాండ్‌లో ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ మీద ఓ మెలోడియస్‌ సాంగ్‌ను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.

Updated Date - Jun 19 , 2024 | 09:54 AM