దేవకీ నందన వాసుదేవ

ABN , Publish Date - Jan 11 , 2024 | 02:42 AM

‘ఈ కథకి ‘దేవకీ నందన వాసుదేవ’ సరైన టైటిల్‌. ఈ కథకోసం రెండేళ్లు వర్క్‌ చేశాను. నేను రాసిన కథల్లో ఆద్యంతం వినోదభరితమైన కథ ఇదే. దీనిపై అశోక్‌ పేరు రాసుంది. అందుకే అతని దగ్గరకు చేరింది...

దేవకీ నందన వాసుదేవ

‘ఈ కథకి ‘దేవకీ నందన వాసుదేవ’ సరైన టైటిల్‌. ఈ కథకోసం రెండేళ్లు వర్క్‌ చేశాను. నేను రాసిన కథల్లో ఆద్యంతం వినోదభరితమైన కథ ఇదే. దీనిపై అశోక్‌ పేరు రాసుంది. అందుకే అతని దగ్గరకు చేరింది. కొత్త నిర్మాత బాలకృష్ణ ఇష్టంతో సినిమా నిర్మిస్తున్నారు. నాకంటే బాగా తీయగలడనే నమ్మకంతో అర్జున్‌కి ఈ కథ ఇచ్చాను. స్టార్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రాగారి మాటలు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. అద్భుతమైన సంభాషణలు అందించారాయన. బీమ్స్‌ మంచి పాటలు ఇచ్చారు. పాత్రలకు తగ్గట్టు ఆర్టి్‌స్టలు సెట్‌ అయ్యారు. ఇంత మాస్‌ పాత్రను అశోక్‌ ఎలా చేస్తాడా అనుకున్నాను. రషస్‌ చూశాక షాక్‌ అయ్యాను. చాలా సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు’ అని ప్రశాంత్‌ వర్మ అన్నారు. ఆయన కథతో అశోక్‌ గల్లా కథానాయకుడిగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వారణాసి మానస కథానాయిక. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌వర్మ మాట్లాడారు. ‘ప్రశాంత్‌వర్మ అద్భుతమైన కథ, సాయిమాధవ్‌ గారి సంభాషణలు, అర్జున్‌ దర్శకత్వ ప్రతిభ ఇవన్నీ ఈ సినిమాను నెక్ట్స్‌ లెవల్లో నిలబెట్టాయి. ఆ ప్రభావం రేపు థియేటర్లలో చూస్తారు.’ అని అశోక్‌ గల్లా నమ్మకంగా చెప్పారు. బాలకృష్ణ రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారని, సాయిమాధవ్‌ మాటలు, బీమ్స్‌ పాటలు అలరిస్తాయని దర్శకుడు చెప్పారు. కృష్ణగారి కుటుంబం నుంచి వచ్చిన అశోక్‌ తప్పకుండా సూపర్‌స్టార్‌ అవుతాడని సాయిమాధవ్‌ బుర్రా నమ్మకం వెలిబుచారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు.

Updated Date - Jan 11 , 2024 | 02:42 AM