నవంబర్‌లో దేవకి నందన
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:39 AM
‘హీరో’ ఫేమ్ అశోక్ గల్లా నటించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రబృందం...
‘హీరో’ ఫేమ్ అశోక్ గల్లా నటించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. నవంబరు 14న ఈ చిత్రం విడుదలవనుంది. ఈ సందర్భంగా నిర్మాత బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘కథ, మాటలు, పాటలు.. ఇలా అన్నీ చక్కగా కుదిరిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ అద్భుతమైన కథ అందించారు. ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు అర్జున్ చెప్పారు. ‘‘ఇదో యూనిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతీ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది’’ అని హీరో అశోక్ గల్లా తెలిపారు.