ఆగస్టులో డిమోంటీ కాలనీ 2

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:11 AM

అరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. బ్లాక్‌బస్టర్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి ఇది సీక్వెల్‌. రాజ్‌వర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ బాలాజీ ఫిలింస్‌ తెలుగులో...

అరుళ్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డిమోంటి కాలనీ 2’. బ్లాక్‌బస్టర్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ’ చిత్రానికి ఇది సీక్వెల్‌. రాజ్‌వర్మ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ బాలాజీ ఫిలింస్‌ తెలుగులో విడుదల చేస్తోంది. అజయ్‌ ఆర్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సంగీతం: శామ్‌ సీఎస్‌, సినిమాటోగ్రఫీ: హరీశ్‌ కన్నన్‌

Updated Date - Jul 25 , 2024 | 06:11 AM