డీమానిటైజేషన్‌.. వందల కోట్లు

ABN , Publish Date - May 08 , 2024 | 05:09 AM

డీమానిటైజేషన్‌ నేపథ్యంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపు దిద్దుకుంటున్న చిత్రం ‘హండ్రెడ్‌ క్రోర్స్‌’. రాహుల్‌, చేతన్‌, యమీ, సాక్షి చౌదరి కీలక పాత్రలు...

డీమానిటైజేషన్‌.. వందల కోట్లు

డీమానిటైజేషన్‌ నేపథ్యంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపు దిద్దుకుంటున్న చిత్రం ‘హండ్రెడ్‌ క్రోర్స్‌’. రాహుల్‌, చేతన్‌, యమీ, సాక్షి చౌదరి కీలక పాత్రలు పోషించారు. విరాట్‌ చక్రవర్తి దర్శకత్వంలో దివిజా కార్తిక్‌, సంగీతం దర్శకుడు సాయికార్తిక్‌ నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్‌, మల్లిక్‌ రామ్‌, నిర్మాతలు హర్షిత్‌ రెడ్డి, దామోదర ప్రసాద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సాయికారిక్‌ మాట్లాడుతూ ‘డీమానిటైజేషన్‌లో వందలాది కోట్ల రూపాయల చుట్టూ తిరిగే కథ ఇది. సినిమా బాగా వచ్చింది. పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.

Updated Date - May 08 , 2024 | 05:09 AM