తల్లి కాబోతున్న దీపికా పదుకొణె

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:29 AM

బాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌లో ఒకరిగా పేరొందిన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ జంట అభిమానులకు తీపి కబురందించారు. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తల్లి కాబోతున్న దీపికా పదుకొణె

బాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌లో ఒకరిగా పేరొందిన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ జంట అభిమానులకు తీపి కబురందించారు. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గురువారం ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్లు, సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చారని ఆ పోస్టులో పేర్కొన్నారు. 2013లో రణ్‌వీర్‌, దీపికా ‘రామ్‌లీలా’లో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఇరువురూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2018లో వీరిద్దరూ ఇటలీలో ఘనంగా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 06:29 AM