సవాల్‌గా స్వీకరించా దీపక్‌ సరోజ్‌

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:53 AM

పలు తెలుగు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన దీపక్‌ సరోజ్‌ ఇప్పుడు ‘సిద్ధార్థ్‌రాయ్‌’ చిత్రంతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యశస్వీ దర్శకత్వంలో...

సవాల్‌గా స్వీకరించా దీపక్‌ సరోజ్‌

పలు తెలుగు చిత్రాల్లో బాల నటుడిగా అలరించిన దీపక్‌ సరోజ్‌ ఇప్పుడు ‘సిద్ధార్థ్‌రాయ్‌’ చిత్రంతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యశస్వీ దర్శకత్వంలో ప్రదీప్‌ పూడి, జయ అడపాక, సుధాకర్‌ బోయిన నిర్మించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా దీపక్‌ సరోజ్‌ మీడియాతో ముచ్చటించారు.

  • బాల నటుడిగా ‘మిణుగురులు’ చిత్రంతో నంది పురస్కారం అందుకున్నాను. చదువు పూర్తి అయ్యాక యశస్వీ నన్ను కలసి ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ కథ చెప్పారు. కథా నేపథ్యం విని షాక్‌ అయ్యాను. అసలు ఇలాంటి పాత్ర నేను చేయగలనా అనుకున్నాను. కానీ మా డైరెక్టర్‌ను నమ్మి ముందుకెళ్లాం.

  • నాది రొటీన్‌ హీరోయిజం ఉన్న పాత్ర కాదు. తను చాలా లాజికల్‌గా ఆలోచిస్తాడు. పెద్దగా దేనికీ స్పందించడు. కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఎమోషనల్‌ అవుతాడు. సవాల్‌గా స్వీకరించి ఈ పాత్ర చేశాను.

  • ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్‌’ చిత్రాలతో మా సినిమాకు పోలికలు లేవు. రెండు భిన్నమైన కథలు. గౌతమ బుద్ధుని తాత్వికత ప్రతిఫలించేలా ఉంటుంది కాబట్టి ‘సిద్ధార్థ్‌రాయ్‌’ అనే టైటిల్‌ పెట్టాం. హీరోగా మరో రెండు సినిమాలు చేస్తున్నాను.

Updated Date - Feb 21 , 2024 | 03:53 AM