సంస్కృత టీచర్స్‌కు అంకితం

ABN , Publish Date - Sep 06 , 2024 | 12:27 AM

రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి ‘శ్లోక’ పేరుతో ఓ సంస్కృత చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాగిణి ద్వివేది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జనార్ధన మహర్షి కుమార్తెలు శ్రావణి, శర్వాణి నిర్మాతలు....

రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి ‘శ్లోక’ పేరుతో ఓ సంస్కృత చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాగిణి ద్వివేది ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జనార్ధన మహర్షి కుమార్తెలు శ్రావణి, శర్వాణి నిర్మాతలు. ఈ సినిమా గురించి జనార్థన మహర్షి వివరిస్తూ ‘సినిమాలోని కీలకమైన రుద్రభూమి సన్నివేశాలను బెంగళూరు, మైసూర్‌లో చిత్రీకరించాం. దేశంలోని పురాతనమైన అనేక శ్మశానాలలో షూటింగ్‌ చేశాం. సంస్కృతంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను అనేక భారతీయ భాషల్లోకి అనువదిస్తాం. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మా చిత్రాన్ని సంస్కృత టీచర్స్‌కు అంకితం ఇస్తున్నాం’ అని చెప్పారు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:27 AM