బాలరాముడికి అంకితం

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:01 AM

తేజేశ్వర్‌, ప్రజ్ఞ నయన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్‌ సి 1000’. కబీర్‌సింగ్‌, సంజయ్‌ పాండే, అనీష్‌ కురువిల్లా కీలకపాత్రలు పోషించారు. తేజేశ్వర్‌ దర్శకుడు...

బాలరాముడికి అంకితం

తేజేశ్వర్‌, ప్రజ్ఞ నయన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్‌ సి 1000’. కబీర్‌సింగ్‌, సంజయ్‌ పాండే, అనీష్‌ కురువిల్లా కీలకపాత్రలు పోషించారు. తేజేశ్వర్‌ దర్శకుడు. ఎస్‌ వీ క్రియేషన్స్‌ బేనర్‌పై నిర్మించారు. ఈ చిత్రం నుంచి శ్రీరాముని గుణాలను కీర్తిస్తూ సాగే ప్రత్యేక గీతాన్ని యూనిట్‌ విడుదల చేసింది. శ్రీధర్‌ ఆత్రేయ స్వరాలందించగా, విజయ్‌ ప్రకాశ్‌ ఆలపించారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ పాటను బాల రాముడికి అంకితం ఇస్తున్నామని తేజేశ్వర్‌ తెలిపారు. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని యూనిట్‌ తెలిపింది. సినిమాటోగ్రఫీ: సుధాకర్‌.

Updated Date - Jan 22 , 2024 | 01:01 AM