జులైలో డెడ్‌పూల్‌ హంగామా

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:22 AM

మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి మరో సూపర్‌ హీరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘డెడ్‌పూల్‌’ సిరీస్‌ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వారిన్‌’. ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూగ్‌ జాక్‌మాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.,,,

జులైలో డెడ్‌పూల్‌ హంగామా

మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి మరో సూపర్‌ హీరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘డెడ్‌పూల్‌’ సిరీస్‌ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వారిన్‌’. ర్యాన్‌ రేనాల్డ్స్‌, హ్యూగ్‌ జాక్‌మాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షాన్‌ లేవీ దర్శకుడు. మార్వెల్‌ స్టూడియోస్‌, 21 ల్యాప్స్‌ ఎంటర్టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాణ సంస్థలు మంగళవారం తెలిపాయి. ఇంగ్లీ్‌షతో పాటు హిందీ, తెలుగు భాషల్లోనూ అదే రోజున విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. డెడ్‌పూల్‌గా ర్యాన్‌రేనాల్డ్స్‌ తన యాక్షన్‌ హంగామాతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఎమ్మా కొరిన్‌, మోరెనా బక్కరిన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 05:22 AM