దాసరి పురస్కారాలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:31 AM

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన పేరిట పురస్కారాలు ఇవ్వడానికి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, నిర్మాత సి. కల్యాణ్‌, బీఎస్‌ఎన్‌ సూర్యనారాయణల...

దాసరి పురస్కారాలు

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన పేరిట పురస్కారాలు ఇవ్వడానికి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, నిర్మాత సి. కల్యాణ్‌, బీఎస్‌ఎన్‌ సూర్యనారాయణల ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పడింది. మే 5న శిల్ప కళావేదికలో దాసరి నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది. ‘దర్శకరత్న డి.ఎన్‌.ఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ పేరుతో పురస్కారాలు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. పలు విభాగాల్లో విశేష కృషి చేసిన సినీ ప్రముఖులను ఎంపిక చేసి పురస్కారాలు అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

Updated Date - Apr 12 , 2024 | 05:31 AM