అమిస్టగా దర్శన రాజేందర్‌

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:42 AM

‘సినిమా బండి’ చిత్రంతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రవీణ్‌ కండ్రీగుల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పరదా’. మహిళా ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, మలయాళ చిత్రం ‘హృదయమ్‌’ ఫేమ్‌...

అమిస్టగా దర్శన రాజేందర్‌

‘సినిమా బండి’ చిత్రంతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రవీణ్‌ కండ్రీగుల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పరదా’. మహిళా ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, మలయాళ చిత్రం ‘హృదయమ్‌’ ఫేమ్‌ దర్శన రాజేంద్రన్‌, సంగీత నటిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్‌ మక్కువ, విజయ్‌ డొంకాడ నిర్మిస్తున్నారు. సోమవారం దర్శన రాజేంద్రన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌ లుక్‌లో పాటు ఓ స్పెషల్‌ వీడియోను విడుదల చేశారు. సినిమాలో దర్శన పోషిస్తున్న పాత్ర పేరు ‘అమిష్ట’. ఈ చిత్రానికి ఎడిటర్‌: ధర్మేంధ్ర కాకరాల, డీఓపీ: మృదుల్‌ సుజిత్‌సేన్‌, సంగీతం: గోపి సుందర్‌.

Updated Date - Jun 18 , 2024 | 03:42 AM