ఆ లోటు తీర్చేలా ‘డార్లింగ్‌’

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:51 AM

ప్రియదర్శి, నభానటేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌రామ్‌ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించారు. సినిమా ఈ నెల 19న విడుదలవుతోన్న...

ప్రియదర్శి, నభానటేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌రామ్‌ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మించారు. సినిమా ఈ నెల 19న విడుదలవుతోన్న సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాని మాట్లాడుతూ ‘‘ఈ మధ్య కామెడీ చిత్రాలు తక్కువైపోయాయి. ఆ లోటు తీర్చేలా వచ్చే చిత్రమే ‘డార్లింగ్‌’. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. త్వరలోనే జగదీశ్‌ అనే కొత్త డైరెక్టర్‌లో మా నిర్మాణ సంస్థలో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో ప్రియదర్శినే హీరో’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా హిలేరియస్‌ ఎంటర్టైనర్‌. నాకు నటన పరంగా నానినే రోల్‌ మోడల్‌’’ అని ప్రియదర్శి అన్నారు. ‘‘కపుల్స్‌ మధ్య జరిగే సరదా సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అందరూ కనెక్ట్‌ అవుతారు’’


అని దర్శకుడు అశ్విన్‌రామ్‌ చెప్పారు. ‘‘ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉంది’’ అని నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Jul 16 , 2024 | 04:51 AM