వై దిస్‌ కొలవెరి?

ABN , Publish Date - May 11 , 2024 | 05:26 AM

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ‘డార్లింగ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ ఎంటర్‌టైనర్‌కు

వై దిస్‌ కొలవెరి?

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ‘డార్లింగ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ ఎంటర్‌టైనర్‌కు అశ్విన్‌రామ్‌ దర్శకుడు. ‘హను-మాన్‌’ చిత్రాన్ని అందించిన కె.నిరంజన్‌రెడ్డి ఈ సినిమాకు నిర్మాత. ‘వై దిస్‌ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తున్నారు. హేమంత్‌ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి నరేశ్‌ ఛాయాగ్రాహకుడు, వివేక్‌ సాగర్‌ సంగీత దర్శకుడు.

Updated Date - May 11 , 2024 | 05:27 AM