అరుదైన వ్యాధితో ‘దంగల్‌’ నటి మరణం

ABN , Publish Date - Feb 18 , 2024 | 02:56 AM

ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’(2016)లో బబిత పాత్రలో నటించిన బాలనటి సుహానీ భట్నాగర్‌ అరుదైన వ్యాదితో శుక్రవారం కన్ను మూసింది. ఆమె వయసు 19 ఏళ్లు. సుహానీ డెర్మటోమయోసైటీస్‌ అనే...

అరుదైన వ్యాధితో ‘దంగల్‌’ నటి మరణం

ఆమిర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’(2016)లో బబిత పాత్రలో నటించిన బాలనటి సుహానీ భట్నాగర్‌ అరుదైన వ్యాదితో శుక్రవారం కన్ను మూసింది. ఆమె వయసు 19 ఏళ్లు. సుహానీ డెర్మటోమయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాద పడుతోంది. స్టెరాయిడ్స్‌ ఇవ్వడమే దీనికి చికిత్స. కండరాలను బలహీన పరచడం, శరీరంపై రాష్‌ రావడం ఈ వ్యాది లక్షణాలు. ఈ వ్యాది తగ్గడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. వారి సూచన మేరకు స్టెరాయిడ్స్‌ తీసుకున్నా, ఆమె లేత శరీరం దానికి తట్టుకోలేక పోయింది. దానికి తోడు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి , లంగ్స్‌లోకి నీరు చేరడంతో సుహానికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. అలా బాద పడుతూనే చివరకు శుక్రవారం సాయంత్రం ఆమె కన్ను మూసిందని సుహానీ తండ్రి పునీత్‌ సజల నయనాలతో చెప్పారు. ‘దంగల్‌’లో నటించిన తర్వాత కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌లో సుహాని నటించింది. 2019లో ఆమె నటనకు దూరం జరిగి చదువు మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుతోంది. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే సుహాని చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లో నటించాలనుకుందనీ, అంతలోనే ఇలా జరగడం చూసి తట్టుకోలేక పోతున్నామని ఆమె తల్లి పూజ చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు.

Updated Date - Feb 18 , 2024 | 02:56 AM