గుండెను తాకే నాన్న పాట

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:24 AM

సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు...

సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న కుటుంబ కథా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. చిత్రబృందం గురువారం ‘నాన్న’ సాంగ్‌ను విడుదల చేసింది. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ గీతానికి లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించగా జై కృష్ణ స్వరపరిచారు. నజీరుద్దీన్‌ ఆలపించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్‌, ఆమని కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సమీర్‌ కల్యాణి

Updated Date - Sep 20 , 2024 | 01:24 AM