నాన్న టైటిల్‌ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు

ABN , Publish Date - May 03 , 2024 | 05:26 AM

‘అల్లరి’ నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో...

నాన్న టైటిల్‌ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు

‘అల్లరి’ నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నరేశ్‌ మాట్లాడుతూ ‘నేను ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన ఉన్నన్ని రోజులూ నాతో సినిమాలు తీసి హిట్లు ఇచ్చి నన్ను నిలబెట్టారు. ఆయన లేనప్పుడు కూడా తన సినిమా టైటిల్‌ ఇచ్చి బ్లెస్‌ చేస్తున్నారు’ అన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన అడవి శేష్‌ మాట్లాడుతూ ‘నరేశ్‌ అంటే మా ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. మే 3న ఈ సినిమాను అందరం థియేటర్లలో చూద్దాం. ఎంజాయ్‌ చేద్దాం’ అన్నారు. ఈ సినిమాతో నరేశ్‌ రూపంలో మంచి ఫ్రెండ్‌ దొరికాడని ఫరియా అబ్దుల్లా చెప్పారు.

Updated Date - May 03 , 2024 | 05:26 AM