గాయని చిత్రకు సైబర్‌ సెగ

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:13 AM

సీనియర్‌ గాయని చిత్రపై సోషల్‌ మీడియాలో దాడి మొదలైంది. అయితే ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ (ఎం) పార్టీతో సహా చిత్రకు మద్దతుగా నిలిచాయి. ఆమె గురించి సోషల్‌ మీడియాలో...

గాయని చిత్రకు సైబర్‌ సెగ

సీనియర్‌ గాయని చిత్రపై సోషల్‌ మీడియాలో దాడి మొదలైంది. అయితే ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు.. కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ (ఎం) పార్టీతో సహా చిత్రకు మద్దతుగా నిలిచాయి. ఆమె గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని దుయ్యబడుతూ, మనసులో మాట చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ, ఇందులో వ్యక్తిగత విమర్శలు చేసి చిత్ర వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడడం సబబు కాదనీ ఆ పార్టీలు అంటున్నాయి. అసలు ఏం .జరిగింది? కొందరు నెటిజన్ల దృష్టిలో చిత్ర చేసిన తప్పు ఏమిటి? అయోధ్యలో రామమందిరం ఈ నెల 22న ప్రారంభం కానున్న సంగతి విదితమే. ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ ‘శ్రీ రామ.. జయ రామ.. జయ జయ రామ’ అనాలనీ చిత్ర ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోలో కోరారు. అంతే కాకుండా అదే రోజు సాయంత్రం తమ ఇంట్లో ఐదు దీపాలను వెలిగించాలని కూడా ఆమె ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు. అయితే చిత్ర ఇలా కోరడం ఓ వర్గం నెటిజన్లకు నచ్చలేదు. రామ మందిరం గురించి ఆమె అలా చెప్పడం బాగోలేదని కొందరంటే, రాజకీయ ప్రయోజనం ఆశించి చిత్ర అలా మాట్లాడుతున్నారని మరి కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందనీ, ఆ విషయంలో చిత్రను తప్పు పట్టడం సరికాదని మరికొందరు ఆమెను సమర్ధిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Updated Date - Jan 17 , 2024 | 06:13 AM