క్యూట్‌గా స్వీట్‌గా

ABN , Publish Date - May 19 , 2024 | 06:31 AM

చైతన్యారావు, హెబ్బాపటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. బాల రాజశేఖరుని దర్శకత్వంలో...

క్యూట్‌గా స్వీట్‌గా

చైతన్యారావు, హెబ్బాపటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు. బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్‌, బాలరాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం నుంచి ‘క్యూట్‌గా స్వీట్‌గా’ అంటూ సాగే గీతాన్ని హీరో అడివిశేష్‌ చేతుల మీదుగా చిత్రబృందం విడుదల చేసింది. కిట్టూ విస్సాప్రగడ్‌ సాహిత్యం అందించగా, దీపు ఆలపించారు. కల్యాణి మాలిక్‌ స్వరాలు సమకూర్చారు. ‘క్యూట్‌గా స్వీట్‌గా పాట సాహిత్యం బావుంది. ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ చిత్రం ఘన విజయం సాధించాలి’ అని అడివి శేష్‌ ఆకాంక్షించారు. ఇదొక మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌ అని దర్శకుడు చెప్పారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

Updated Date - May 19 , 2024 | 06:31 AM