క్రైమ్‌ క్యాన్సర్‌ లాంటిది.. పెరగనివ్వకూడదు

ABN , Publish Date - Oct 03 , 2024 | 02:53 AM

‘వారంలో ఎన్‌కౌంటర్‌ జరిగిపోవాలి’ అని రావు రమేశ్‌ అనగానే ‘వారం అక్కర్లేదు.. మూడే రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరొస్తుంది’ అంటూ స్టయిలిష్‌ నడకతో ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్‌. ఆయన హీరోగా నటించిన ‘వేట్టయన్‌.. ద హంటర్‌’ సినిమా...

‘వారంలో ఎన్‌కౌంటర్‌ జరిగిపోవాలి’ అని రావు రమేశ్‌ అనగానే ‘వారం అక్కర్లేదు.. మూడే రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరొస్తుంది’ అంటూ స్టయిలిష్‌ నడకతో ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్‌. ఆయన హీరోగా నటించిన ‘వేట్టయన్‌.. ద హంటర్‌’ సినిమా ఈ నెల పదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం విడుదల చేసిన ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అలాగే అమితాబ్‌, రానా, ఫాహద్‌ ఫాజిల్‌ పాత్రల్ని కూడా ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. ‘క్రైమ్‌ అనేది క్యాన్సర్‌ లాంటిది. దానిని పెరగనివ్వకూడదు’ వంటి డైలాగులు, అద్భుతమైన విజువల్స్‌ అలరిస్తున్నాయి. ‘నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్‌ వాడినే సార్‌.. నా నుంచి వాడిని కాపాడడం ఎవరి వల్లా కాదు’ అంటూ రజనీకాంత్‌ డైనమిక్‌గా చెప్పే డైలాగ్‌ ఈ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మంజు వారియర్‌, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సుభాస్కరన్‌ నిర్మించారు.


కోలుకుంటున్న రజనీకాంత్‌

  • ఆయన ఆరోగ్యంపై ప్రధాని ఆరా

తీవ్ర అస్వస్థతకు గురై చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ క్రమంగా కోలుకుంటున్నారు. గురువారం డిశ్చార్జ్‌ అయ్యే అవకాశముందని ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. ఇంటికి చేరిన తర్వాత ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సివుంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుండగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రజనీ ఆరోగ్యం గురించి ఆయన సతీమణి లతా రజనీకాంత్‌కు ఫోన్‌ చేసి వాకబు చేశారు.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Oct 03 , 2024 | 02:54 AM