సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంది

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:43 AM

నవీన్‌చంద్ర నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్‌ కీలక పాత్రలు పోషించారు. క్రైమ్‌ హారర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కు జే.ఎస్‌ నందిని దర్శకత్వం వహించారు. సుఖ్‌దేవ్‌ లాహిరి నిర్మించారు...

సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంది

నవీన్‌చంద్ర నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్‌ కీలక పాత్రలు పోషించారు. క్రైమ్‌ హారర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కు జే.ఎస్‌ నందిని దర్శకత్వం వహించారు. సుఖ్‌దేవ్‌ లాహిరి నిర్మించారు. నేడు ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ కథ విన్నప్పుడు ఎంతో ఎక్సైట్‌ అయ్యా. హారర్‌ థ్రిల్లర్స్‌లో ఇది సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంది’’ అని చెప్పారు. డైరెక్టర్‌ నందిని మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్‌ను ఆదరిస్తారు. ఈ వెబ్‌ సిరీస్‌ను కూడా అలాగే ఆదరిస్తారనే నమ్మకముంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 03:43 AM