క్రేజీ ప్రాజెక్ట్‌కు 9న శ్రీకారం
ABN , Publish Date - Aug 07 , 2024 | 01:07 AM
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఈ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ‘కే.జి.ఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న...
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఈ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ‘కే.జి.ఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచి ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘శుక్రవారం పూజా కార్యాక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభిస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలవుతుంది. ఎన్టీఆర్ అక్టోబర్ నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ లోపు ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఎంపిక చేయలేదు’ అని చెప్పారు, ప్రస్తుతం తను నటిస్తున్న ‘వార్ 2’ చిత్రం షూటింగ్‌ను ఈలోగా పూర్తి చేసి, ప్రశాంత్ నీల్ చిత్రం మీద పూర్తిగా దృష్టి పెట్టనున్నారు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ ప్రతిష్ఠాకత్మక చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచి నిర్మించనున్నారు. పూర్తి వివరాలను చిత్ర ప్రారంభోత్సవం రోజున వెల్లడిస్తారు.