క్రేజీ కాంబోలో వైబ్‌

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:48 AM

‘ఊరుపేరు భైరవకోన’ చిత్రంతో హిట్‌ ట్రాక్‌ ఎక్కారు సందీప్‌ కిషన్‌. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించిన స్వరూప్‌...

క్రేజీ కాంబోలో వైబ్‌

‘ఊరుపేరు భైరవకోన’ చిత్రంతో హిట్‌ ట్రాక్‌ ఎక్కారు సందీప్‌ కిషన్‌. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా కొత్త చిత్రం ఖరారైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించిన స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్‌ యాదవ్‌ నక్కిన నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వైబ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో సందీప్‌ కిషన్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ అవతార్‌లో కనిపించారు. కాలేజీ బేస్డ్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరీ ఇది. 2025 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Apr 02 , 2024 | 05:48 AM