కౌంట్‌డౌన్ మొదలు
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:25 AM
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ఫ 2 ది రూల్’ చిత్రం విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వంద రోజుల్లో...
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ఫ 2 ది రూల్’ చిత్రం విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వంద రోజుల్లో అంటే డిసెంబర్ 6న ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ పేర్కొంటూ పోస్టర్ విడుదల చేశారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మరో వైపు నిర్మాణానంతర పనులు కూడా శరవేగంతో జరుగుతున్నాయి. ‘కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా ‘పుష్ప 2’ అత్యున్నత స్థాయిలో ఉండబోతోంది. మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా అంతకు మించి ‘తగ్గేదేలే’ అనిపించే రీతిలో సినిమా ఉంటుంది’ అని దర్శకనిర్మాతలు చెప్పారు. దేవిశ్రీప్రసాద్ పాటలు అలరిస్తాయని తెలిపారు.