కాన్ఫిడెంట్‌గా ఉన్నా

ABN , Publish Date - Jan 26 , 2024 | 02:58 AM

‘ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. యాక్షన్‌, ఎమోషన్‌ అంశాలతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. జీవితం చాలించాలనుకొనే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడనే అంశాన్ని చిత్రంలో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి దీనిపై కాన్ఫిడెంట్‌గా ఉన్నా’ అన్నారు...

కాన్ఫిడెంట్‌గా ఉన్నా

‘ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. యాక్షన్‌, ఎమోషన్‌ అంశాలతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. జీవితం చాలించాలనుకొనే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడనే అంశాన్ని చిత్రంలో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి దీనిపై కాన్ఫిడెంట్‌గా ఉన్నా’ అన్నారు నిర్మాత రవి కస్తూరి. గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్‌ ఆన్‌’ చిత్రాన్ని ఆయన దయానంద్‌ దర్శకత్వంలో నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా గురువారం రవి మీడియాతో మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తూ ఈ చిత్ర నిర్మాణం చూసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. కంటెంట్‌ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఫస్ట్‌ కాపీ చూసి హ్యాపీగా ఫీలయ్యా. ఇకపై నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నా. ఇప్పటికే రెండు కథలు విన్నా. ఈ సినిమా రిలీజ్‌ అయ్యాక వాటిని అనౌన్స్‌ చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - Jan 26 , 2024 | 02:58 AM