కమిటీ కుర్రోళ్లు వస్తున్నారు

ABN , Publish Date - Jul 21 , 2024 | 01:42 AM

గ్రామీణ నేపథ్యంలో స్నేహం, ప్రేమ, భావోద్వేగాల కలబోతగా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, శ్రావ్య, విషిక తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యదు వంశీ దర్శకుడు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల...

గ్రామీణ నేపథ్యంలో స్నేహం, ప్రేమ, భావోద్వేగాల కలబోతగా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, శ్రావ్య, విషిక తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యదు వంశీ దర్శకుడు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ఖరారు చేసింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ శనివారం తెలిపింది. ఈ సందర్భంగా నిహారికా కొణిదెల మాట్లాడుతూ ‘మా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై వస్తున్న తొలి చిత్రమిది. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో కొత్త నటీనటులతో ఈ సినిమా తీశాం. యువతకు, కుటుంబ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంద’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. స్నేహితులతో సెలబ్రేట్‌ చేసుకునేలా మా సినిమా ఉంటుంద’ని చెప్పారు.

Updated Date - Jul 21 , 2024 | 01:42 AM