కమిటీ కుర్రోళ్లు యాభై రోజుల వేడుక

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:08 AM

నిహారిక కొణిదెల సమర్పణలో ఫణి అడపాక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం యాభై రోజుల వేడుక సోమవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగింది. సీనియర్‌ నటీనటులతో పాటు...

నిహారిక కొణిదెల సమర్పణలో ఫణి అడపాక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం యాభై రోజుల వేడుక సోమవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగింది. సీనియర్‌ నటీనటులతో పాటు పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తూ నిర్మించిన ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు నాగబాబు, దిల్‌ రాజు ముఖ్య అతిధులుగా హాజరైన యూనిట్‌ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ రోజుల్లో ఒక సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం అరుదనీ, ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఆ రికార్డ్‌ సాధించినందుకు అతిధులు అభినందించారు.

Updated Date - Oct 01 , 2024 | 04:08 AM