హై వోల్టేజ్‌ యాక్షన్‌తో వస్తున్నాం

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:20 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తర్వాత నా సోలో మూవీగా ‘దేవర’ మీ ముందుకొస్తోంది. కొంచెం ఒత్తిడిగా ఉంది. రిలీజ్‌ కోసం మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హై వోల్టేజ్‌ యాక్షన్‌తో ఈ చిత్రం రాబోతోంది’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం తర్వాత నా సోలో మూవీగా ‘దేవర’ మీ ముందుకొస్తోంది. కొంచెం ఒత్తిడిగా ఉంది. రిలీజ్‌ కోసం మీతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హై వోల్టేజ్‌ యాక్షన్‌తో ఈ చిత్రం రాబోతోంది’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించారు. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె. నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. మంగళవారం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. కరడుగట్టిన సముద్రదొంగల నుంచి గ్రామాన్ని రక్షించేందుకు కథానాయకుడు చేసిన పోరాటం నేపథ్యంలో సాగిన ట్రైలర్‌ ఆధ్యంతం అలరించింది. తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ పలికించిన భావోద్వేగాలు అలరించాయి. పల్లెటూరి యువతిగా జాన్వీ కనిపించారు.


ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘దేవర విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. పతాక సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. సముద్ర జలాల అడుగున చిత్రీకరణ చేశాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’ అన్నారు. శివ కొరటాల మాట్లాడుతూ ‘సెట్స్‌లో ఒక్కసారి కెమెరా ఆన్‌ అయిందంటే ఎన్టీఆర్‌ సర్వం మర్చిపోయి పాత్రలో లీనమై నటిస్తాడు. అప్పట్లో సీనియర్‌ ఎన్టీఆర్‌-శ్రీదేవిలా ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌ జోడీ బాగుందని ప్రేక్షకులకు మెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు. జాన్వీకపూర్‌ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌తో కలసి నటించాలనే నా కోరిక ‘దేవర’తో తీరింది. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎన్టీఆర్‌ నుంచి నటనకు సంబంధించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను’ అని తెలిపారు.

Updated Date - Sep 11 , 2024 | 06:31 AM