కొత్త కాన్సె్‌ప్టతో వస్తున్నాం
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:58 AM
‘పాటలు, ఫైట్లు, కామెడీ లాంటివి లేకుండా ఒక కొత్త కాన్సె్‌ప్టతో వస్తున్న సినిమా ‘105 మినిట్స్’. డైలాగ్స్ కూడా ఉండవు. అయినా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని దర్శకుడు రాజు దుస్సా అన్నారు....
‘పాటలు, ఫైట్లు, కామెడీ లాంటివి లేకుండా ఒక కొత్త కాన్సె్‌ప్టతో వస్తున్న సినిమా ‘105 మినిట్స్’. డైలాగ్స్ కూడా ఉండవు. అయినా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని దర్శకుడు రాజు దుస్సా అన్నారు. హన్సిక లీడ్‌రోల్‌లో రాజు దుస్సా తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర ్భంగా రాజు దుస్సా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
స్ర్కీన్‌ప్లే ఈ సినిమాకు బలం. తర్వాత ఏం జరుగ బోతోందో ప్రేక్షకులు ఊహించలేరు. ఒక కనిపించని మనిషి పంచభూతాలను గుప్పిట్లో పెట్టుకొని ఓ అమ్మాయిని ఇబ్బందిపెట్టే క్రమంలో ఏం జరిగిందనేది ప్రధాన కథ.
ఒకటే పాత్రపైన లెంగ్తీ షాట్ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ‘105 మినిట్స్’ చిత్రం పుట్టింది. సింగిల్ క్యారెక్టర్‌తో రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోబె డతాం. ప్రేక్షకులకు రియల్ టైంలో ఎదురుగా కూర్చోని చూస్తున్న అనుభూతినిస్తుంది.
మా సినిమాటోగ్రాఫర్ ఇచ్చిన సూచనతో ఈ సినిమాకు సింగిల్ షాట్ అనే కాన్సెప్ట్ జతయ్యింది. దీనికి చాలా గ్రౌండ్ వర్క్ చేశాం. హన్సిక కథ వినగానే ఓకే చెప్పారు. చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లారు. ఇందులో ఆమె నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.