కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా

ABN , Publish Date - May 05 , 2024 | 06:33 AM

పతంగుల పోటీతో రూపుదిద్దుకొన్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ‘పతంగ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ప్రీతీ పగడాల, ‘జీ సరిగమప’ రన్నరప్‌...

కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా

పతంగుల పోటీతో రూపుదిద్దుకొన్న కామెడీ స్పోర్ట్స్‌ డ్రామా ‘పతంగ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ప్రీతీ పగడాల, ‘జీ సరిగమప’ రన్నరప్‌ ప్రణయ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం టీజర్‌ను గురువారం సాయంత్రం దర్శకుడు సానా బుచ్చిబాబు విడుదల చేశారు. మరో అతిధి ఎంపీ సిరిసిల్ల రాజయ్య సినిమా కాంటెస్ట్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణీత్‌ మాట్లాడుతూ ‘ఒక కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన ఎలిమెంట్స్‌ అన్నీ మా చిత్రంలో ఉన్నాయి. సినిమా టీజర్‌ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు. ‘చాలా వ్యయప్రయాసలతో ఈ సినిమా తీశాం. రిజల్ట్‌ బాగా రావడానికి టీమ్‌ ఎంతో కృషి చేసింది. మ్యాచ్‌ కోసం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు’ అని నిర్మాతలు విజయ్‌ శేఖర్‌ అన్నె, సంపత్‌ మక, సురేశ్‌ కొత్తింటి అన్నారు.

Updated Date - May 05 , 2024 | 06:33 AM