రా మచ్చా
ABN , Publish Date - Oct 01 , 2024 | 04:10 AM
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది...
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి రెండోపాటను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ‘రా మచ్చా మచ్చా’ అంటూ హీరో పాత్రను పరిచయం చేస్తూ సాగే ఈ గీతానికి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. తమన్ స్వరాలు సమకూర్చగా, నకాష్ అజీజ్ ఆలపించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: తిరుణావుక్కరుసు