చల్లగాలి ప్రేమగీతం

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:57 AM

ప్రణవ్‌, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’. భువన్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత. ఇటీవలె విడుదలైన ప్రచార చిత్రాలకు...

చల్లగాలి ప్రేమగీతం

ప్రణవ్‌, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’. భువన్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత. ఇటీవలె విడుదలైన ప్రచార చిత్రాలకు చక్కటి ఆదరణ దక్కింది. గురువారం చిత్రబృందం రెండో గీతాన్ని విడుదల చేసింది. ‘చల్లగాలి’ అంటూ సాగే రొమాంటిక్‌ గీతాన్ని యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పీరియాడిక్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. పుంగనూరు గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తక్కువ బడ్జెట్‌లోనే మంచి సినిమాను తీశాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని నిర్మాత తెలిపారు. ప్రేక్షకులను రెండు దశాబ్దాలు వెనక్కు తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది అని ప్రణవ్‌ చెప్పారు.

Updated Date - Jan 05 , 2024 | 06:57 AM