భారతీయుడు-2 బృందానికి సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:23 AM

భారతీయుడు-2 సినిమా బృందానికి సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నటుడు కమల్‌హాసన్‌తో పాటు...

భారతీయుడు-2 సినిమా బృందానికి సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా నటుడు కమల్‌హాసన్‌తో పాటు చిత్ర బృందం శంకర్‌, సిద్దార్థ, సముద్రఖని కలిసి డ్రగ్స్‌ వాడకానికి వ్యతిరేకంగా అవగాహన వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయమన్నారు. కాగా గత వారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోకు కొత్త వాహనాలు ప్రారంభించిన సమయంలో డ్రగ్స్‌ నిర్మూలనకు సినీ పరిశ్రమ తమ వంతు సహకారం అందించాలని సీఎం సూచించారు. ప్రతి సినిమా విడుదల సమయంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నటీనటులు కనీసం రెండు నిమిషాల నిడివితో వీడియో చిత్రీకరించి ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సూచన మేరకు సినీ ప్రముఖులు, క్రీడా కారులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు.


నా మాటల్ని అపార్థం చేసుకున్నారు

‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తను మాట్లాడిన మాటల్ని అపార్ధం చేసుకున్నారని సిద్ధార్థ్‌ చెప్పారు. డ్రగ్స్‌ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను. సీఎం సార్‌.. మేం ఎప్పుడూ మీతోనే’’ అంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 01:23 AM