వార్‌-2లో ఎన్టీఆర్‌ పాత్రపై క్లారిటీ..!

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:12 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ఇండియా స్టార్‌గా ఎదిగారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఆయన వరుస పాన్‌ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. దేవర చిత్రం సెట్స్‌పై ఉండగానే బాలీవుడ్‌ చిత్రం వార్‌-2కు సైన్‌ చేశారు...

వార్‌-2లో ఎన్టీఆర్‌ పాత్రపై క్లారిటీ..!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాన్‌ఇండియా స్టార్‌గా ఎదిగారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఆయన వరుస పాన్‌ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. దేవర చిత్రం సెట్స్‌పై ఉండగానే బాలీవుడ్‌ చిత్రం వార్‌-2కు సైన్‌ చేశారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో ఆయన నటిస్తున్నారనే అధికారక ప్రకటన కొన్నాళ్ల క్రితమే వెలువడింది. తాజాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పోషించే పాత్రపై మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భారతీయ రా ఏజెంట్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారని నిర్మాత ఆదిత్య చోప్రా వెల్లడించారు. అంతేకాక ఎన్టీఆర్‌ అభిమానులు పండుగ చేసుకునేలా మరో తీపి కబురును కూడా నిర్మాత ఆదిత్య చోప్రా అందించారు. ఎన్టీఆర్‌ పాత్ర కేవలం ఈ సినిమాకు మాత్రమే పరిమితం కాలేదని..ఆ పాత్రను కొనసాగిస్తూ ఈ స్పై యూనివర్స్‌లోనే మరో ప్రత్యేక చిత్రాన్ని తీర్చిదిద్దే అలోచన ఉందని అన్నారు. ఈ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో తెరకెక్కే మరిన్ని చిత్రాల్లో ఎన్టీఆర్‌ అతిథిగా మెరవనున్నారు అని నిర్మాత ప్రకటించారు. కాగా, ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్‌ నటించనున్నారు. ‘బ్రహాస్త్ర’ ఫేం అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయ్యటానికి చిత్ర బృందం ప్లాన్‌ చేస్తోంది.

Updated Date - Mar 06 , 2024 | 09:36 AM